అమ్మ చీరలో నిహారిక.. జాన్వి డ్యాన్స్‌ - celebrities social media round up
close
Published : 07/12/2020 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మ చీరలో నిహారిక.. జాన్వి డ్యాన్స్‌

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న విశేషాలు

► నిహారిక తన తల్లి పద్మజ నిశ్చితార్థం చీరలో మెరిశారు. డిసెంబరు 9న వివాహం నేపథ్యంలో శనివారం ఆమెకు మంగళ స్నానం చేయించి, పెళ్లి కుమార్తెను చేసిన సంగతి తెలిసిందే. వేడుకల్లో భాగంగా ఆదివారం తల్లి పట్టుచీరలో నిహారిక కనిపించారు. అది 32 ఏళ్ల క్రితం చీర కావడం విశేషం.

►  తను నృత్యం చేస్తుంటే చెల్లి ఖుషి స్పందన లేకుండా ఉందంటున్నారు జాన్వి కపూర్‌. ఆమె ఇప్పటికే పలుమార్లు తన డ్యాన్స్‌తో నెటిజన్లను ఆకట్టుకున్నారు. తాజాగా ఇంట్లో చక్కగా నృత్యం చేస్తున్న వీడియోలు షేర్‌ చేశారు.

►  ‘క్రాక్‌’ సినిమా గోవా షెడ్యూల్‌ పూర్తయింది. సినిమా చిత్రీకరణ ఎంతో సరదాగా జరిగిందని రవితేజ చెప్పారు. నటి శ్రుతిహాసన్‌, దర్శకుడు గోపీచంద్‌ మలినేనితోపాటు తీసుకున్న ఫొటో షేర్‌ చేశారు.

►  నటి సుస్మితా సేన్‌ ఓ వీడియోకు ఫిదా అయ్యారు. ముగ్గురు చిన్నారులు సంతోషంగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేశారు. దాన్ని చూస్తుంటే నవ్వు ఆగలేదని, ఉల్లాసంగా అనిపించిందని చెప్పారు.

►  నితిన్‌ 30వ చిత్రం షూటింగ్‌ ఆరంభమైంది. గాంధీ మేర్లపాక తీస్తున్న ఈ సినిమాలో తమన్నా, నభా నటేష్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ హిట్‌ ‘అంధధూన్‌’కు తెలుగు రీమేక్‌ ఇది.

ఇవీ చదవండి..
చిట్టి చెల్లికి పెళ్లంట.. మహేశ్‌ లుక్‌ వైరల్‌















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని