నిహారిక-చైతన్యల డ్యాన్స్‌..రవితేజతో శ్రుతి పోటీ - celebrities social media round up
close
Published : 08/12/2020 02:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిహారిక-చైతన్యల డ్యాన్స్‌..రవితేజతో శ్రుతి పోటీ

సోషల్‌ లుక్‌: సెలబ్రిటీలు పంచుకున్న విశేషాలు

* నిహారిక-చైతన్యల పెళ్లి వేడుకల కోసం కుటుంబ సభ్యులంతా ఉదయ్‌పూర్‌ చేరుకున్నారు. అక్కడ అడుగుపెట్టిన వధూవరులు ఉత్సాహంగా స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అదేవిధంగా కల్యాణ్‌ దేవ్‌ తీసిన ఫొటోలంటూ ఉపాసన కొన్ని స్టిల్స్‌ షేర్‌ చేశారు.

* రవితేజతో పోటీపడ్డ శ్రుతి హాసన్‌ ఓడిపోయారు. ‘క్రాక్‌’ సినిమా సెట్‌లో ఫిట్‌నెస్‌ పరంగా పందెం వేసుకున్నారు. రవితేజ ప్లాంక్‌ వేసినంత సేపు శ్రుతి వేయలేకపోయారు. ఈ వీడియోను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. చిత్ర బృందం కుటుంబంలా మారిందన్నారు.

* రాశీ ఖన్నా పుట్టినరోజు వేడుకల్ని కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా నిర్వహించారు. తన తల్లిదండ్రులు పార్టీ ఏర్పాటు చేసి, సర్‌ప్రైజ్‌ చేశారంటూ నటి వారికి ధన్యవాదాలు తెలిపారు. కరోనా కారణంగా శ్రేయోభిలాషుల్ని పార్టీకి పిలవలేదంటూ వీడియో పంచుకున్నారు.

* ఆమిర్‌ ఖాన్‌ కుమార్తె ఐరాఖాన్‌ విహారయాత్రలో ఉన్నారు. పనుల్ని పక్కన పెట్టి.. బ్రేక్‌ తీసుకోవాల్సిన సమయం అంటూ పొట్టి దుస్తుల్లో ఉన్న ఫొటోలు షేర్‌ చేశారు. ఇవి కాస్త వైరల్‌గా మారాయి.

* శర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మహా సముద్రం’ సినిమా షూటింగ్‌ ఆరంభమైంది. అజయ్‌ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. 

ఇవీ చదవండి..
అమ్మ చీరలో నిహారిక.. జాన్వి డ్యాన్స్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని