పవన్ వచ్చేశాడు.. పూల్‌ పార్టీలో నిహారిక - celebrities social media round up
close
Published : 09/12/2020 02:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్ వచ్చేశాడు.. పూల్‌ పార్టీలో నిహారిక

సోషల్‌ లుక్‌: సెలబ్రిటీల విశేషాలు

* పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఉదయ్‌పూర్‌ చేరుకున్నారు. ఆయన గత కొన్ని రోజులుగా పర్యటనలు, నిరసనలతో బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తన సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లికి హాజరవుతారా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. కానీ తన తమ్ముడు వచ్చాడని.. చెబుతూ.. నాగబాబు ఫొటో షేర్‌ చేశారు. ‘ఆఖరి ఆనందమూ వచ్చేసింది’ అని నాగబాబు పేర్కొన్నారు.

* పెళ్లి కూతురు నిహారిక పూల్‌ పార్టీని ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రీ-వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం ఈ పార్టీని నిర్వహించారు. ఈ సందర్భంగా కునాల్‌ రావల్‌ రూపొందించిన లావెండర్‌ గౌనులో నిహారిక తళుక్కుమన్నారు. ఈ పార్టీలో తీసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

* వరుణ్‌ తేజ్‌ తన చెల్లెలు నిహారిక పెళ్లి ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాడని అల్లు అర్జున్‌ అన్నారు. ‘నా సోదరుడి పట్ల ఎంతో గర్వపడుతున్నా’ అని ఫొటో షేర్‌ చేశారు. అంతేకాదు తన సతీమణి స్నేహారెడ్డి సంగీత్‌ పార్టీలో అందంగా కనిపించిందని ఆమె స్టిల్‌ పంచుకున్నారు.

* సూర్య-గౌతమ్‌ మేనన్‌ కాంబినేషన్‌లో వస్తోన్న కొత్త చిత్రం ‘నవరస’. ఈ సినిమా సెట్‌లో తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సూర్య కొత్త లుక్‌లో స్మార్ట్‌గా కనిపించారు.

* ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాపై రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ ప్రశంసలు కురిపించారు. సినిమా మనసును తాకిందని, సూర్య నటన అద్భుతంగా ఉందని చెప్పారు. మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సూర్య బదులిస్తూ.. దేవిశ్రీకి ధన్యవాదాలు చెప్పారు.

 

ఇదీ చదవండి..

నిహారిక-చైతన్యల డ్యాన్స్‌.. రవితేజతో శ్రుతి పోటీ


















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని