చెప్పలేనంత ఆనందంలో వరుణ్‌..సామ్‌ సంబరం - celebrities social media round up
close
Published : 12/12/2020 01:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చెప్పలేనంత ఆనందంలో వరుణ్‌..సామ్‌ సంబరం

సోషల్‌ లుక్‌: సెలబ్రిటీలు పంచుకున్న విశేషాలు

* చిట్టి చెల్లి నిహారికకు, బావ చైతన్య జొన్నలగడ్డకు వరుణ్‌తేజ్‌ శుభాకాంక్షలు చెప్పారు. ‘వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన నా బంగారు తల్లికి, డ్యాషింగ్‌ బావకు అభినందనలు. నేను ఇప్పుడెంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. నూతన జంటను విష్‌ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌’ అంటూ పెళ్లి ఫొటో షేర్‌ చేశారు. నిహారిక కూడా వివాహానికి సంబంధించిన ఫొటోలు పంచుకున్నారు.

* సమంత ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. క్రిస్మస్‌ నేపథ్యంలో ఆమె హైదరాబాద్‌లోని తన స్వగృహాన్ని అందంగా అలంకరిస్తున్నారు. ఏడాదిలో తనకు ఎంతో ఇష్టమైన నెల ఇదేనని పేర్కొన్నారు. 

* ప్రముఖ నటుడు దిలీప్‌ కుమార్‌కు షారుక్‌ ఖాన్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వ్యక్తిత్వం ఈ ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయనతో గడిపిన ప్రతి క్షణం గుర్తుందని, దిలీప్‌ తనను సొంత వ్యక్తిలా చూసుకునేవారని.. ఫొటో షేర్‌ చేశారు.

* ప్రియాంకా చోప్రా తన ఫొటో ఆల్బమ్‌లోని చక్కటి చిత్రాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఆమె తండ్రి అశోక్‌ చోప్రా ఆర్మీలో పనిచేసేవారు. బాల్యంలో ఆయన యూనిఫాం వేసుకుని ఇంట్లో చక్కర్లు కొట్టేదాన్నని, పెద్దయ్యాక నాన్నలా అవ్వాలనుకున్నానని చెప్పారు. తన ఆలోచనల్ని తండ్రి ఎంతో ప్రోత్సహించేవారని గుర్తు చేసుకున్నారు.

* ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో సీతగా నటిస్తున్న ఆలియా భట్‌ షూటింగ్‌లో భాగంగా తీసుకున్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రతిరోజూ మేకప్‌కు ముందు మేకప్‌ ఆర్టిస్ట్‌ పునీత్‌ ఇలా మసాజ్‌ చేస్తారని పేర్కొన్నారు.

 
















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని