నిశ్చయ్‌ న్యూ క్లిక్స్‌.. సెట్‌లో రేణూ ఇలా..! - celebrities social media round up
close
Published : 13/12/2020 02:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిశ్చయ్‌ న్యూ క్లిక్స్‌.. సెట్‌లో రేణూ ఇలా..!

సోషల్‌ లుక్‌: సెలబ్రిటీలు పంచుకున్న విశేషాలు

నిహారిక, చైతన్యల వివాహం జరిగిన మూడు రోజులు గడుస్తున్నప్పటికీ సోషల్‌ మీడియాలో సందడి మాత్రం తగ్గలేదు. కొత్త కొత్త ఫొటోల్ని కుటుంబ సభ్యులు షేర్‌ చేస్తూనే ఉన్నారు. నిశ్చయ్‌ను విష్‌ చేస్తూ ఉపాసన ఫొటోలు షేర్‌ చేశారు. వివాహ విందులో వరుణ్‌తేజ్‌తోపాటు నూతన దంపతులున్న ఫొటోను నాగబాబు పంచుకున్నారు. నిహారిక సైతం తన ఆల్బమ్‌లోని కొన్ని స్టిల్స్‌ను షేర్‌ చేశారు. స్నేహారెడ్డి తన ఫ్యామిలీ ఫొటోలను పంచుకున్నారు. పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌ అంటూ వరుణ్‌తేజ్‌ ఫ్యామిలీ ఫొటో పోస్ట్‌ చేశారు.

లాక్‌డౌన్‌ తర్వాత తొలిసారి థియేటర్‌కు వెళ్లానని రకుల్‌ప్రీత్‌ సింగ్‌ చెప్పారు. థియేటర్‌లో తీసిన ఓ ఫొటోను షేర్‌ చేశారు. చాలా రోజుల తర్వాత ఇలా చిత్రాన్ని చూడటం ఎంతో బాగుందని, ‘టెనెట్‌’ను వీక్షించానని తెలిపారు.

నటి రాశీ ఖన్నా తన కజిన్‌ కృతి మల్హోత్రా వివాహ వేడుకల్లో సందడి చేస్తున్నారు. హల్దీలో భాగంగా తీసుకున్న ఫొటోలను ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. కుటుంబసభ్యులంతా పసుపు వర్ణం దుస్తుల్లో ఆనందంగా కనిపించారు.

♦ నటి రేణూ దేశాయ్‌ పూర్తిగా షూటింగ్‌ మోడ్‌లో ఉన్నారు. ఆమె గత కొన్ని రోజులుగా సినిమా సెట్‌లో తీసిన ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తున్నారు. ఆసక్తికరమైన ప్రాజెక్టులో నటిస్తున్నట్లు చెప్పారు. చీరలో రెండు జడలు వేసుకుని తాజా వీడియోలో కనిపించారు.

ఇదీ చదవండి..
చెప్పలేనంత ఆనందంలో వరుణ్‌.. సామ్‌ సంబరం

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని