హైదరాబాద్‌కు సూపర్‌స్టార్‌.. శ్రుతి గానం..! - celebrities social media round up
close
Published : 14/12/2020 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైదరాబాద్‌కు సూపర్‌స్టార్‌.. శ్రుతి గానం..!

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న విశేషాలు

* రజనీకాంత్‌, నయనతార హైదరాబాద్‌ చేరుకున్నారు. వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమా ‘అన్నాత్తే’. ఈ చిత్రం షూటింగ్‌ కోసం ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి భాగ్య నగరానికి విచ్చేశారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేశ్‌ కూడా నటిస్తున్నారు.

* కథానాయిక శ్రుతిహాసన్‌ తనలోని గాయనిని మరోసారి నెటిజన్లకు చూపించారు. చీకటిగా ఉన్న ఓ గదిలో పియానో వాయిస్తూ పాట పాడుతున్న వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియోకు మంచి స్పందన లభిస్తోంది.

* కథానాయకుడు రానా సోమవారం తన పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో జపాన్‌లోని భళ్లాలదేవుడి అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. దానికి సంబంధించిన ఫొటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

* ‘భలేగా తగిలావే బంగారం..’ అంటున్నారు రవితేజ. ఆయన, శ్రుతిహాసన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్‌’. ఈ సినిమాలోని ఓ పాటను సోమవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా రవితేజ పాట టీజర్‌ విడుదల చేశారు.

* తన చెల్లెలు నిహారిక పెళ్లి ఏర్పాట్లను వరుణ్‌ తేజ్‌ ఎంతో చక్కగా చేశాడని నాగబాబు ప్రశంసించారు. కుమారుడితో తీసుకున్న ఫొటోను షేర్‌ చేశారు. వరుణ్‌ ఎప్పుడూ అంచనాలకు మించి పనిచేస్తాడని, అతడి పట్ల గర్వంగా ఉందని చెప్పారు. మరోపక్క అత్తారింట్లో నిహారిక ఉన్న ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. 

ఇదీ చదవండి..
నిశ్చయ్‌ న్యూ క్లిక్స్‌.. సెట్‌లో రేణూ ఇలా..!























మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని