మొత్తం కరోనా కేసుల్లో అవి 13.75 శాతమే! - center on Active Coronavirus Cases declining
close
Published : 06/10/2020 20:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మొత్తం కరోనా కేసుల్లో అవి 13.75 శాతమే!

పాజిటివ్‌ల కంటే రికవరీలే ఎక్కువ: కేంద్రం

దిల్లీ: మంగళవారానికి భారత్‌లో మొత్తం క్రియాశీల కేసులు 9,19,023గా ఉన్నాయని, మొత్తం కేసులోడ్‌లో అవి కేవలం 13.75 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే క్రియాశీల కేసుల శాతం క్రమంగా తగ్గుతున్న ధోరణిని నమోదు చేస్తుందని తెలిపింది. ఈ ధోరణి కోలుకునే వారి శాతం పెరుగుదలకు మద్దతు ఇస్తోందని ప్రస్తావించింది. అలాగే జాతీయ రికవరీ రేటు (84.74 శాతం)పెరుగుదలకు ఎక్కువ మంది కోలుకోవడానికి తోడ్పడిందని పేర్కొంది.

గత 24 గంటల్లో 75,787 మంది కొవిడ్ నుంచి కోలుకొని, డిశ్చార్జి కాగా, అదే సమయంలో 61,267 కొత్త కేసులు నమోదయ్యాయి. 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్ధారణ అయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఒక్క మహారాష్ట్రలోనే 24 గంటల్లో 13వేల మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. కాగా, ఇప్పటికీ మహారాష్ట్రలోనే అత్యధిక కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే ఒక్కరోజులో 884మంది మహమ్మారికి బలికాగా, వాటిలో 80 శాతం మరణాలు 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే నమోదయ్యాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని