86 శాతం కేసులు ఆ ఆరు రాష్ట్రాల్లోనే - centre says six states reported max case rise
close
Published : 28/02/2021 22:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

86 శాతం కేసులు ఆ ఆరు రాష్ట్రాల్లోనే

ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం కలవరపెడుతోంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్టాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో ఈ ఆరు రాష్ట్రాల నుంచే సుమారు 86.37 శాతం కేసులు వచ్చాయని తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 8,623 కేసులు రాగా.. అత్యల్పంగా గుజరాత్‌లో 451 కేసులు నమోదయ్యాయి. కేరళలో 3,792, పంజాబ్‌లో 593, కర్ణాటకలో 523, తమిళనాడులో 486 మందికి కొత్తగా కరోనా సోకింది.

కరోనా మరణాల్లో కూడా ఈ ఆరు రాష్ట్రాలే ముందు వరుసలో ఉన్నాయి. మహారాష్ట్రలో 51 మంది మృతి చెందగా, కేరళలో 18 మంది, పంజాబ్‌లో 11 మంది మరణించినట్లు కేంద్రం వెల్లడించింది. ఆదివారం దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన కరోనా కేసులతో కలిపి యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,64,511కి చేరింది. దేశం మొత్తం మీద ఇప్పటి వరకు 1,07,75,169 మంది కరోనా బారి నుంచి కోలుకోగా, 1,57,051 మంది మరణించారు. మరోవైపు కొద్దిరోజుల క్రితమే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న 9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కేంద్రం ఉన్నతస్థాయి బృందాలను పంపింది. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బృందాలు మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, పంజాబ్‌, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు వెళ్లాయని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ బృందాలు ఆయా రాష్ట్రాల కరోనా కట్టడి చర్యలను పర్యవేక్షిస్తాయని తెలిపింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని