బుమ్రా రికార్డు బద్దలు చేసిన చాహల్‌ - chahal surpasses jasprit bumrah to become indias leading wicket taker
close
Published : 13/03/2021 18:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బుమ్రా రికార్డు బద్దలు చేసిన చాహల్‌

అహ్మదాబాద్‌: టీమ్‌ఇండియా మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా అవతరించాడు. పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా రికార్డును బద్దలు కొట్టాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (28)ని చాహల్‌ ఔట్‌ చేశాడు. ఇది అతడి కెరీర్లో 60వ వికెట్‌. బుమ్రా 59 వికెట్ల రికార్డును అధిగమించాడు. కెరీర్లో 46 టీ20లు ఆడిన చాహల్‌కు మొత్తంగా శుక్రవారం నాటి మ్యాచ్‌ వందోది కావడం గమనార్హం. 2016లో అతడు హరారేలో జింబాబ్వేపై అరంగేట్రం చేశాడు. ఇక 54 వన్డేల్లో చాహల్‌ 92 వికెట్లు తీయడం గమనార్హం. తొలి మ్యాచులో 8 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసిన టీమ్‌ఇండియా రెండో పోరులో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని