సింహానికి కోహ్లీకి తేడా చెప్పిన యూజీ - chal spot the difference between kohli and lion
close
Published : 11/08/2020 02:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సింహానికి కోహ్లీకి తేడా చెప్పిన యూజీ

(చిత్రం: ఆర్‌సీబీ ట్వీట్‌ నుంచి)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020 జరుగుతుందని ప్రకటించిన మరుక్షణం నుంచే ఉత్సాహం మొదలైంది. ఫ్రాంచైజీలన్నీ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. తమ ఆటగాళ్ల గురించి గొప్పలు చెబుతున్నాయి. ఇతర ఫ్రాంచైజీలను కవ్విస్తున్నాయి. తాజాగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓ ట్వీట్‌ చేసింది. అందులో కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ, మృగరాజు చిత్రాలు పోస్ట్‌ చేసింది. ‘తేడాలేంటో గుర్తించండి. ఎందుకంటే మేం కనుక్కోలేక పోతున్నాం’ అని వ్యాఖ్య పెట్టింది.

ఆర్‌సీబీ ట్వీట్‌కు అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. అయితే అదే జట్టు ఆటగాడు, మణికట్టు మాంత్రికుడు యుజువేంద్ర చాహల్‌ ఓ తేడా చెప్పాడు! ‘హుమ్‌..! మొదటి చిత్రంలోని సింహం దుస్తులు ధరించింది. రెండో దాంట్లో వేసుకోలేదు’ అని నవ్వుతున్న ఎమోజీలు పెట్టాడు. ఆర్‌సీబీ చిరకాల శత్రువు చెన్నైసూపర్‌ కింగ్స్‌ సైతం ఓ పంచ్‌ వేసింది. ‘అమ్మ ఈ రోజంతా ఏడుస్తూనే ఉంది. నువ్వెక్కడికి వెళ్లావు? నీ జట్టును ఏం చేసుకున్నావ్‌?!’ అని రెండు సింహాలున్న చిత్రాన్ని పోస్ట్‌ చేసింది.

యూఏఈ వెళ్లడానికి అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఫ్రాంచైజీలు స్థానికంగా ఏర్పాటు చేసిన శిబిరాలకు ఆటగాళ్లను ఆహ్వానిస్తున్నాయి. కొన్నాళ్లు క్వారంటైన్‌లో ఉంచుతారు. దుబాయ్‌కు వెళ్లేందుకు 24 గంటల ముందు రెండుసార్లు ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు చేస్తారు. అందులో నెగెటివ్‌ వస్తేనే ప్రయాణం. లేదంటే ఇక్కడే క్వారంటైన్‌ అవ్వాల్సి ఉంటుంది. లీగ్‌ ఆరంభానికి ముందు మళ్లీ పరీక్షలు చేసి బాగుంటేనే మ్యాచుల్లో ఆడిస్తారు.  లేదంటే కష్టం. అందరి కన్నా ముందుగా చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆగస్టు 22న దుబాయ్‌కి వెళ్తుందని సమాచారం.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని