చండీగఢ్‌లో నేటి నుంచే వారాంతపు లాక్‌డౌన్ - chandigarh announces weekend lockdown
close
Published : 16/04/2021 16:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చండీగఢ్‌లో నేటి నుంచే వారాంతపు లాక్‌డౌన్

చండీగఢ్‌: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లో సైతం ఆ దిశగా అగుడులు పడ్డాయి. చండీగఢ్‌ అడ్మినిస్ట్రేటర్‌ వీపీసింగ్‌ బడ్నోరే అధ్యక్షతన శుక్రవారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాధికారులతో చర్చించిన ఆయన నేటి రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. 

కరోనా ఉగ్రరూపం దాలుస్తుండటంతో పలు రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ప్రతి ఆదివారం రాష్ట్రమంతా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. మాస్కులు ధరించకుండా కనిపిస్తే  భారీ జరిమానాలు వడ్డించనున్నట్లు పేర్కొంది. కొద్దిరోజుల క్రితమే దిల్లీ కూడా వారాంతపు‌ కర్ఫ్యూ విధించింది.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని