పది, ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామనడం బాధాకరం - chandrababu comments on ap govt
close
Published : 01/05/2021 14:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పది, ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామనడం బాధాకరం

తెదేపా అధినేత చంద్రబాబు

అమరావతి: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఏపీలో ప్రజలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ సరిగా అందటం లేదని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా చంద్రబాబు అధ్యక్షతన టీఎన్టీయూసీ నేతలతో మేడే వేడుకలు నిర్వహించారు. వివిధ రంగాల కార్మిక నేతలతో ఆయన ఆన్‌లైన్‌ ద్వారా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘కార్మిక దోపిడీకి స్వస్తి పలికిన రోజు మే డే. సంఘటిత, అసంఘటిత కార్మికులంతా జరుపుకొనే పండుగ ఇది. కరోనా రెండో దశ ఉద్ధృతిలో అంతా భయపడిపోయే పరిస్థితి. కరోనా నివారణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అనేక రంగాల వారు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మొదట్నుంచీ చెబుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వస్తోంది’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ఇంత క్లిష్ట పరిస్థితుల్లో పది, ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామనడం బాధాకరం. వ్యాక్సిన్‌ కూడా వేసుకోని విద్యార్థులను పరీక్షలకు రమ్మంటున్నారు. విద్యార్థులు ఎక్కణ్నుంచో వివిధ మార్గాల్లో పరీక్షా కేంద్రాలకు రావాల్సి ఉంటుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కరోనా బారిన పడే ప్రమాదముందని ఆందోళనలో ఉన్నారు. సంక్షోభాన్ని నివారించాలనే ఆలోచనే ప్రభుత్వానికి లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించే స్థాయికి వచ్చారు. ప్రాణాలే లేనప్పుడు ఇక భవిష్యత్తు ఎక్కడుంటుంది. రాష్ట్రంలో చోటు చేసుకునే ప్రతి మరణమూ హత్యగా భావించాలి. ఎవరైనా కరోనాపై మాట్లాడితే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు’’ అని చంద్రబాబు అన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని