మన్యంలో చరణ్‌ దంపతుల సందడి - charan and upasana at devipatnam
close
Published : 05/03/2021 11:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మన్యంలో చరణ్‌ దంపతుల సందడి

హైదరాబాద్‌: ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఎ.వీరవరంలో రామ్‌చరణ్‌ దంపతులు సందడి చేశారు. సినిమా చిత్రీకరణ నేపథ్యంలో ఎ.వీరవరం, కొత్త అంగుళూరు వద్ద గోదావరి ఒడ్డున ‘ఆచార్య’ పాట చిత్రీకరణ చేశారు. దీంతో రామ్‌చరణ్‌ను చూడటానికి అభిమానులు ఆ ప్రాంతానికి భారీగా చేరుకున్నారు.

విద్యార్థులతో ఉపాసన ముచ్చట్లు

దేవీపట్నంలోని పాఠశాల విద్యార్థులతో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన ముచ్చటించారు. గురువారం దేవీపట్నం వచ్చిన ఆమె తొయ్యేరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కాసేపు సరదాగా మాట్లాడారు. పలువురు విద్యార్థినులు ఆమెతో సెల్ఫీలు దిగారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని