‘అయ్యయ్యయ్యో..’ఈ పాటను త్వరగా చూడండో! - chavu kaburu challaga lyrical vedio
close
Published : 17/03/2021 14:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అయ్యయ్యయ్యో..’ఈ పాటను త్వరగా చూడండో!

హైదరాబాద్‌: వరుసగా మాస్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్న నటుడు కార్తికేయ. తాజాగా ‘చావు కబురు చల్లగా’ సినిమాలో మార్చురీ వ్యాన్‌ నడిపే బస్తీ బాలరాజుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌. ఒకప్పటి హీరోయిన్‌ ఆమని కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ‘అయ్యయ్యో..’అంటూ సాగుతున్న లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. ఈ పాటకు సాహిత్యాన్ని కరుణాకర్‌ అడిగర్ల అందించగా, ఆదిత్య తాడేపల్లి ఆలపించారు. జేక్స్‌ బిజోయ్‌ స్వరాలు సమకూర్చారు. ఒక వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రాన్ని జీఏ2 బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించారు. నూతన దర్శకుడు కౌషిక్‌ పెగల్లపాటి తెరకెక్కించారు. మార్చి 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సాంగ్‌ లిరికల్‌ వీడియోను చూసేయండి!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని