ఓటీటీలో ‘చావు కబురు చల్లగా’ - chavu kaburu challaga premieres on aha
close
Published : 11/04/2021 18:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటీటీలో ‘చావు కబురు చల్లగా’

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది థియేటర్‌లో ప్రేక్షకులను అలరించిన పలు చిత్రాలు ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రేక్షకులను అలరించిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘చావు కబురు చల్లగా’. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్‌ తెరకెక్కించారు. బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ ఒదిగిపోయి నటించారు. ఇక భర్త కోల్పోయిన యువతి పాత్రలో లావణ్య మెప్పించింది.

ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఏప్రిల్‌ 23 నుంచి ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ‘ఆహా’ ఈ విషయాన్ని  ట్విటర్‌లో వెల్లడించింది. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్ని వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లు అరవింద్‌ సమర్పించారు. ఆమని, మురళీశర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జేక్స్‌ బిజోయ్‌ స్వరాలు సమకూర్చారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని