‘ఫిక్స్‌ అయిపో..’అంటూ టీజ్‌ చేస్తున్న కార్తికేయ! - chavu kaburu challaga song
close
Published : 11/03/2021 15:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఫిక్స్‌ అయిపో..’అంటూ టీజ్‌ చేస్తున్న కార్తికేయ!

హైదరాబాద్: మా ఇంటి కోడలు నువ్వేనంటూ..ఫిక్సైపోమంటూ టీజ్‌ చేస్తూ లావణ్య త్రిపాఠి వెంట పడుతున్నాడు కార్తికేయ గుమ్మకొండ. వీరిద్దరు ప్రధానపాత్రలలో తెరకెక్కుతున్న ‘చావు కబురు చల్లగా’చిత్రం నుంచి ‘ఫిక్సైపో..’అంటూ సాగుతున్న పూర్తి వీడియోసాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. మంచి మాస్‌ బీట్‌తో సాగుతున్న ఈ సాంగ్‌లో కార్తికేయ తన డ్యాన్స్‌తో దుమ్ములేపారు. గీతా ఆర్ట్స్‌-2 బ్యానర్‌పై బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటీనటులిద్దరు విలక్షణ పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్‌ మాస్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ గీతానికి చిత్ర దర్శకుడు కౌషిక్‌ పెగల్లపాటి, సనారే సాహిత్యం అందించగా రాహుల్‌ సిప్లగంజి ఆలపించారు. జేక్స్‌ బిజోయ్‌ స్వరాలు సమకూర్చారు. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటిదాకా ఈ వీడియో సాంగ్‌ చూసి ఎంజాయ్‌ చెయ్యండి!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని