మాస్‌-క్లాస్‌ తేడాను చెక్‌ చెరిపేస్తుంది: రాజమౌళి - check pre release event
close
Published : 21/02/2021 22:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాస్‌-క్లాస్‌ తేడాను చెక్‌ చెరిపేస్తుంది: రాజమౌళి

ఇంటర్నెట్‌ డెస్క్‌: మాస్‌ సినిమాలు.. క్లాస్‌ సినిమాలు అనే తేడాను ‘చెక్‌’ చెరిపేస్తుందని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెక్‌’. ప్రియాప్రకాశ్‌ వారియర్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటించారు. కల్యాణిమాలిక్‌ సంగీతం అందించారు. వి.ఆనందప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రిరిలీజ్‌ వేడుక ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రాజమౌళి, యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌, డైరెక్టర్లు వెంకీ కుడుముల, గోపీచంద్‌ మలినేని హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘ఇప్పుడు పాటలే జనాలను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఈ చిత్రంలో ఉన్నది ఒక్క పాటే అయినా చాలా బాగుంది. ట్రైలర్‌ చూసిన తర్వాత ఎప్పుడు చూద్దామా అని అనిపించిన చిత్రం ‘చెక్’. మాస్‌ సినిమా.. క్లాస్‌ సినిమా అవరోధాలను తొలగిస్తుందన్న నమ్మకం ఉంది. ఒకేరకమైన సినిమాలు చేస్తాడన్న అభిప్రాయాలను ఈ సినిమాతో నితిన్‌ చెరిపేస్తాడు’ అని ఆయన అన్నారు.

నితిన్‌ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌లో ఎప్పటికీ మరిచిపోలేని హిట్‌ సినిమా ‘సై’. అది కూడా క్రీడా నేపథ్యం ఉన్న చిత్రం. దాని తర్వాత మరోసారి క్రీడా నేపథ్యం ఉన్న ఈ సినిమా చేశాను. అసలు నటన అంటే ఏంటనేది చంద్రశేఖర్‌ యేలేటి నుంచి నేర్చుకున్నాను. ఈ సినిమా ఆయనకు కేవలం పేరు మాత్రమే కాకుండా డబ్బు కూడా తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా. మాకు అతి పెద్ద బలం కల్యాణి మాలిక్‌ ఇచ్చిన సంగీతం. సినిమా విడుదలైన తర్వాత ఆ విషయం అందరికీ తెలుస్తుంది. అందరూ బాగా కష్టపడి పని చేశారు’ అని నితిన్‌ అన్నాడు. వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ.. ‘పెళ్లయిన తర్వాత ఎవరైనా నెమ్మదిస్తారు. కానీ నితిన్‌ మాత్రం సినిమాల స్పీడు పెంచాడు’ అని అన్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని