ఉత్కంఠ రేకెత్తిస్తోన్న ‘చెహ్రే’ ట్రైలర్‌ - chehre trailer
close
Published : 18/03/2021 22:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉత్కంఠ రేకెత్తిస్తోన్న ‘చెహ్రే’ ట్రైలర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌, ఇమ్రాన్‌ హష్మీ కలిసి నటించిన చిత్రం ‘చెహ్రే’. రూమి జాఫ్రీ దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఓ కారు ప్రమాదానికి గురయ్యే సన్నివేశంతో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అమితాబ్‌, ఇమ్రాన్‌ల నటన, వాళ్ల మధ్య సాగే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఓ అమ్మాయి కిడ్నాప్‌కి గురికావడం, అమితాబ్‌పై ఇమ్రాన్‌ ఆగ్రహించడం వంటి సీన్లు ఆసక్తి పెంచుతున్నాయి. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలుస్తోంది. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో లాయర్‌గా కనిపించనున్నారు అమితాబ్‌. మోషన్‌ పిక్చర్స్‌, సరస్వతి ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకురానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని