‘చెక్‌’ ఫస్ట్‌ గ్లింప్స్‌ వచ్చేసింది! - chek first glimpse
close
Updated : 03/01/2021 12:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘చెక్‌’ ఫస్ట్‌ గ్లింప్స్‌ వచ్చేసింది!

ఇంటర్నెట్‌: నితిన్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘చెక్’ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ వచ్చేసింది. జైలు గదిలో నితిన్‌ను చూపిస్తూ ‘‘జైల్లో ఆదిత్య అనే ఖైదీ చెస్‌ అద్భుతంగా ఆడుతున్నాడు’’ అనే పరిచయ వ్యాఖ్యలు సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి. మరోపక్క న్యాయమూర్తి ఆదిత్యకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునివ్వడం, పోలీస్‌ అధికారి ‘‘దేశద్రోహి..అదీ నీ గుర్తింపు’’ అని మాట్లాడటం సరికొత్త కథలా అనిపిస్తోంది. నితిన్‌లోని కొత్తకోణాన్ని తెరపై చూపించేలా విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి సినిమాను తీర్చిదిద్దుతున్నారని ఈ గ్లింప్స్‌ చూడగానే అర్థమవుతోంది. భవ్య క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రియాప్రకాష్‌ వారియర్‌  హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి ఆసక్తి రేపుతున్న ఈ ఫస్ట్‌ గ్లింప్స్‌ను మీరు ఒకసారి చూసేయండి. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని