Corona: కరోనాపై పోరాటానికి CSK చేయూత - chennai super kings donates 450 oxygen concentrators to tamil nadu government
close
Published : 09/05/2021 16:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: కరోనాపై పోరాటానికి CSK చేయూత

ప్రభుత్వ ఆస్పత్రులకు 450 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు.. 

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో కరోనా వైరస్‌ రెండో దశ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇటీవల రోజుకు నాలుగు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దాదాపు నాలుగు వేల మంది నిత్యం ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఆక్సిజన్‌ కొరత ఎక్కువగా ఉండటంతో ఈ మరణాలు సంభవిస్తున్నాయి. కాగా, తమిళనాడులో వైరస్‌ ఉద్ధృతి అధికంగా ఉండటంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంఛైజీ అక్కడి ప్రభుత్వానికి 450 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అందజేయడానికి ముందుకు వచ్చింది.

ఈ మేరకు శనివారం రాత్రి తమ సామాజిక మాధ్యమాల్లో ఈ విషయాన్ని తెలియజేస్తూ నూతన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలిసి సీఎస్కే ప్రతినిధులు ఒక ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ అందజేశారు. ‘భూమిక’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి త్వరలోనే అన్ని కాన్సన్‌ట్రేటర్లను అందజేస్తామని తెలిపారు. వాటిని ప్రభుత్వాస్పత్రుల్లో కొవిడ్‌ బాధితులకు ఉపయోగిస్తామన్నారు. ఇదిలా ఉండగా, ఐపీఎల్‌ 14వ సీజన్‌లో పలువురు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సిబ్బంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజి, మైఖేల్‌ హస్సీలను మెరుగైన వైద్యం కోసం దిల్లీ నుంచి చెన్నైకు తరలించారు. ఈ క్రమంలోనే బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలి మిగిలిన మ్యాచ్‌లను వాయిదా వేసింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని