బెంగళూరును బెంబేలెత్తించిన జడేజా - chennai won the match vs banglore
close
Updated : 29/04/2021 12:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెంగళూరును బెంబేలెత్తించిన జడేజా

కోహ్లీసేనకు తొలి ఓటమి..

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్దేశించిన 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులకు పరిమితమైంది. దీంతో చెన్నై 69 పరుగులతో విజయం సాధించడమే కాదు, పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో బెంగళూరును బెంబేలెత్తించాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన కోహ్లీసేన ఆది నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఏ దశలోనూ విజయం వైపు పరుగెడుతున్నట్లు అనిపించలేదు. ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌(34; 15 బంతుల్లో 4x4, 2x6), మాక్స్‌వెల్‌(22; 15 బంతుల్లో 3x4) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. చివరిలో చాహల్‌ (8), సిరాజ్‌ (12) నాటౌట్‌గా నిలిచారు.  ఈ క్రమంలోనే చెన్నై బౌలర్లలో జడేజా 3, ఇమ్రాన్‌ తాహిర్‌ 2, సామ్‌కరన్‌, శార్దూల్‌ ఠాకూర్‌ చెరో వికెట్‌ తీశారు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌(33; 25 బంతుల్లో 4x4, 1x6), డుప్లెసిస్‌(50; 41 బంతుల్లో 5x4, 1x6) శుభారంభం చేశారు. ఆపై సురేశ్‌ రైనా(24; 18 బంతుల్లో 1x4, 3x6), రవీంద్ర జడేజా(62*; 28 బంతుల్లో 4x4, 5x6) దంచికొట్టారు. కాగా, హర్షల్‌ పటేల్ వేసిన చివరి ఓవర్‌లో జడ్డూ రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేశాడు. ఐదు సిక్సులు, ఒక బౌండరీ, ఒక డబుల్‌ రన్‌తో పాటు ఒక నోబాల్‌ పడటంతో మొత్తం 37 పరుగులు సాధించాడు. బెంగళూరు బౌలర్లలో హర్షల్‌ మూడు వికెట్లు తీయగా చాహల్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని