భారత్‌ కరోనా టీకాలు మంచివే: చైనా - china unwillingly concedes india corona vaccine
close
Published : 11/01/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌ కరోనా టీకాలు మంచివే: చైనా

దిల్లీ: భారత్‌ తయారుచేసిన కొవిడ్‌-19 టీకాలకు విదేశాల్లో డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో.. చైనా అయిష్టంగానే మన సామర్థ్యాన్ని అంగీకరించింది. ఈ మేరకు ఆ దేశ అధికార పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌’లో కథనం వచ్చింది. ‘‘పరిశోధన, ఉత్పాదన సామర్థ్యం పరంగా చైనా తయారుచేసిన కొవిడ్‌-19 టీకాలకు భారత వ్యాక్సిన్లు ఏ మాత్రం తీసిపోవని నిపుణులు చెబుతున్నారు. టీకాల తయారీలో భారత్‌కు ప్రపంచంలోనే అత్యధిక ఉత్పాదన సామర్థ్యం ఉంది. అలాగే కార్మిక, ఇతర సౌకర్యాల ఖర్చులు కూడా అక్కడ తక్కువ’’ అని తెలిపింది. ఈ కారణంగా.. టీకా ఎగుమతి చేయాలన్న భారత ప్రణాళిక అంతర్జాతీయ మార్కెట్‌కు సానుకూల పరిణామం అవుతుందని పేర్కొంది.

అయితే దీని వెనుక భారత్‌కు రాజకీయ, ఆర్థిక ఉద్దేశాలు ఉండొచ్చని డ్రాగన్‌ ఆరోపించింది.  తన రాజకీయ బ్రాండ్‌ను మెరుగుపరచుకోవడానికి, అంతర్జాతీయంగా చైనా టీకాల ప్రాబల్యాన్ని తగ్గించడానికి భారత్‌ స్వదేశీ టీకాలను ఉపయోగించొచ్చని కూడా అనుమానాలు వ్యక్తంచేసింది. హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ సంస్థను సందర్శించిన జిలిన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌ నిపుణుడు జియాంగ్‌ చున్లాయ్‌ చేసిన వ్యాఖ్యలను కూడా తన ప్రకటనలో పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో వంటి సంస్థలతో భారత టీకా సంస్థలు మొదటే చేతులు కలిపాయని కూడా ఆయన తెలిపినట్లు వివరించింది. ప్రపంచ టీకాల సరఫరాలో భారత్‌ వాటా 60 శాతమని, వాటి కోసం అనేక దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని ‘బీబీసీ’ చేసిన వ్యాఖ్యనూ ప్రస్తావించింది.  

 ఇవీ చదవండి..

 చిమ్మచీకట్లో పాక్‌!

ఇంగ్లాండ్‌ మహారాణి, రాజుకు కరోనా టీకా..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని