చైనా టీకా రూ.10వేలంట..! - china vaccine price less than Rs 10000 for two doses
close
Updated : 22/08/2020 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైనా టీకా రూ.10వేలంట..!

 గ్లోబల్‌ టైమ్స్‌ కథనం

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ను ఎదుర్కోవడానికి చైనా టీకా తెచ్చి సాయం చేస్తా అన్నా.. అది అందుకోవడం ప్రపంచానికి భారంగానే మారేట్లుంది. చాలా దేశాలు ప్రతి ఒక్కరికీ టీకా అందేట్లు చేయాలనే లక్ష్యంతో కొనుగోళ్లకు పోటీ పడుతున్నాయి. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చాలా కంపెనీలు టీకా ధరలు పెనుభారం కాకుండా చూసుకొంటున్నాయి. కానీ, చైనాకు చెందిన సినోఫార్మా నిర్ణయించిన ధర చూస్తే బెదిరిపోవాల్సిందే.  ఇప్పటికే మూడో దశ క్లీనికల్‌ ట్రయల్స్‌‌ మొదలుపెట్టిన  ‘సినోఫార్మా’  వీలైనంత త్వరగా మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది.

రెండు డోసులు 144 డాలర్లు.. 

ఇటీవల సినోఫార్మ ఛైర్మన్‌ లి జింగ్‌జాన్‌ మాట్లాడుతూ తమ టీకా 1000 యువాన్లలోపే ఉంటుందని పేర్కొన్నారు. అంటే అమెరికా కరెన్సీలో దాదాపు 144డాలర్లు. దీనిని నేటి విలువ ప్రకారం భారత కరెన్సీలోకి మారిస్తే రూ.10,791. దీంతో పోల్చుకుంటే అమెరికా కంపెనీ మోడెర్నా తయారు చేసే టీకా రెండు డోసుల ధర 37 డాలర్లలోపు ఉంటుంది. మన రూపాయిల్లోకి మారిస్తే రూ. 2,773 ఉంటుంది. ఇక ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం తయారు చేస్తున్న టీకా ధర రెండు డోసులు కలిపి ఆరు డాలర్లు ( రూ.550) ఉండొచ్చు. ఇక భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్న కోవాగ్జిన్‌ ధర మిగిలిన వాటి కంటే చౌకగానే ఉంటుందని ఆ సంస్థ ఎండీ కృష్ణ ఎల్ల ఇప్పటికే తెలిపారు. 

ఎన్ని టీకాలు ఏ దశల్లో ఉన్నాయి..

మొత్తం 170 బృందాలు టీకాల తయారీకి కష్టపడుతున్నాయి. వీటిల్లో 138 ప్రీక్లీనికల్‌ ట్రయల్స్‌‌, 25 ఫేజ్‌ 1లో, 15 ఫేజ్‌2లో, 7 ఫేజ్‌3లో ఉన్నాయి. మూడో దశకు చేరుకొన్న వాటిలో ఆక్స్‌ఫర్డ్‌, ఫైజర్‌, మోడెర్నా, సినోవాక్‌, బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌- సినో ఫార్మా, వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌-సినో ఫార్మా సంస్థలు ఉన్నాయి. 

రష్యా వ్యాక్సిన్‌ ధర గోప్యం..

ఇప్పటికే అందుబాటులోకి వచ్చినట్లు ప్రకటించిన రష్యా టీకా ధర మాత్రం వెల్లడికాలేదు. త్వరలోనే దీని ధరను కూడా ప్రకటించే అవకాశం ఉంది. భారత్‌ కంపెనీలు కూడా ఈ వ్యాక్సిన్‌పై ఆసక్తి చూపిస్తున్నట్లు రష్యా ఆర్‌డీఐఎఫ్‌ సీఈవో కిరిల్‌ దిమిత్రియేవ్‌ వెల్లడించారు. భారత్‌లో తయారయ్యే పక్షంలో వీటి ధర గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని