మా టీకా తీసుకొనేట్లైతేనే ఇక్కడికి రండి..! - china visa for foreigners including indians if they take chinese vaccine
close
Published : 16/03/2021 17:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మా టీకా తీసుకొనేట్లైతేనే ఇక్కడికి రండి..!

బీజింగ్‌: చైనాలోకి విదేశీయులను అనుమతించేందుకు మెల్లగా ఆ దేశం సన్నాహాలు చేస్తోంది. కరోనా వ్యాప్తి కట్టడి నిమిత్తం విదేశీయుల రాకపోకలపై ఇక్కడ ఆంక్షలు విధించారు. తాజాగా అమెరికా, భారత్‌, పాక్‌ సహా పలు దేశాల జాతీయులు చైనాలో అడుగుపెట్టేలా నిబంధనలు మార్చనున్నారు. చైనా తయారీ టీకాలు తీసుకొన్న వీసా దరఖాస్తుదారులను పరిశీలించనున్నట్లు చాలా దేశాల్లో చైనా దౌత్యకార్యాలయాలు పేర్కొంటున్నాయి. వీసా దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ అయినా తీసుకొని ఉండాలి. ఇప్పటికే అమెరికాలోని చైనా దౌత్య కార్యాలయం వీసా దరఖాస్తు దారులకు చైనా వ్యాక్సిన్లను తప్పనిసరి చేసింది. ఇవి చైనాలో పనిచేసేవారికి, వ్యాపార పర్యటనలకు వెళ్లేవారికి, మానవీయ కార్యక్రమాలకు వెళ్లేవారికి, కుటుంబాలతో తిరిగి కలిసేవారికి వర్తిస్తాయి.

చైనా ఇప్పటికే నాలుగు దేశీయ టీకాలను ప్రజలకు వేస్తోంది. ఇక్కడ ఒక్క విదేశీ టాకాకూ అనుమతి ఇవ్వలేదు. ఇక చైనా మాత్రం భారీగా టీకాలను విదేశాలకు సరఫరా చేస్తోంది. టర్కీ, ఇండోనేషియా, కంబోడియా దేశాలు వీటిని కొనుగోలు చేస్తున్నాయి. ఇక భారత్‌, శ్రీలంక, ఫిలిప్పీన్స్‌, ఇటలీ దేశాల్లోని చైనా దౌత్యకార్యాలయాలు కూడా ఇలాంటి ప్రకటనలే చేస్తున్నాయ. అంతర్జాతీయంగా చైనా టీకాలపై నమ్మకం పెంచేందుకు డ్రాగన్‌ ఈ చర్యలు చేపడుతోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని