మనబంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి - chiranjeevi Spl Birthday Wishes To Nagababu
close
Published : 29/10/2020 13:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మనబంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి

తమ్ముడి బర్త్‌డే.. చిరు ఎమోషనల్‌ పోస్ట్‌

హైదరాబాద్‌: తన తమ్ముడు నాగబాబు పుట్టినరోజుని పురస్కరించుకుని చిరు భావోద్వేగానికి గురయ్యారు. తమ్ముళ్లతో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ సోషల్‌మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. ఓ సినిమా ఫంక్షన్‌లో నాగబాబు, పవన్‌ కల్యాణ్‌తో దిగిన ఓ ఫొటోని ఆయన ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘నిజాయతీ, నిబద్ధత, ఎమోషనల్‌, దయా హృదయం కలిగిన నా ప్రియమైన సోదరుడు నాగబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మున్ముందు నీకంతా మంచే జరగాలని ఆశిస్తున్నాను. మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని, నీ ప్రతి పుట్టినరోజుకి అది మరింత బలపడాలని కోరుకుంటున్నాను’ అని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌ సైతం నాగబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే నాన్నా. ఇలాంటి అందమైన జీవితాన్ని నాకు అందించినందుకు థ్యాంక్యూ. ఎప్పటికీ నువ్వే నా బెస్ట్‌ ఫ్రెండ్‌. లవ్‌ యూ’ అని వరుణ్‌ పోస్ట్‌ పెట్టారు. ‘క్రీడలు, ఆటల్లో నేను భాగమయ్యేలా చేసిన వ్యక్తి, నా ధైర్యం, నన్ను ఎప్పుడూ సపోర్ట్‌ చేసే మా మామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ సాయిధరమ్‌ తేజ్‌ విషెస్‌ తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని