మెగా కాంబో రిపీట్‌ కానుందా? - chiranjeevi collaborate with big b once again
close
Published : 13/03/2021 14:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెగా కాంబో రిపీట్‌ కానుందా?

టాక్‌ ఏమిటంటే..

హైదరాబాద్‌: అమితాబ్‌ బచ్చన్‌, చిరంజీవి.. ఒకరు బాలీవుడ్‌లో మెగాస్టార్‌ అయితే మరొకరు టాలీవుడ్‌ మెగాస్టార్‌. వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలనుకునే ప్రేక్షకులకు ‘సైరా’ ఓ మంచి అనుభూతిని అందించింది. కాగా, తాజా సమాచారం ప్రకారం ఈ మెగా కాంబో మరోసారి రిపీట్‌ కానున్నట్లు తెలుస్తోంది. తాను ప్రధానపాత్రలో నటిస్తున్న ఓ బాలీవుడ్‌ సినిమాలో కీలకపాత్ర కోసం అమితాబ్‌‌.. చిరంజీవిని సంప్రదించారట.

బిగ్‌బిపై ఉన్న ఆత్మీయత, అభిమానంతో చిరు ఆ పాత్ర చేసేందుకు ఓకే అన్నట్లు బీటౌన్‌లో టాక్‌ వినిపిస్తోంది. దీంతో, చిరు.. పూర్తిస్థాయి పాత్రలో కనిపించనున్నారా? లేక అతిథి పాత్రలో నటించనున్నారా? అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఈ మేరకు నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ షూట్‌లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరుకు జంటగా కాజల్‌ సందడి చేయనున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని