వైష్ణవ్‌కు ఖరీదైన కానుక ఇచ్చిన చిరు - chiranjeevi gifts panja vaishnav tej a swanky wrist watch
close
Published : 11/03/2021 14:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైష్ణవ్‌కు ఖరీదైన కానుక ఇచ్చిన చిరు

హైదరాబాద్‌: తన మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌కు మెగాస్టార్‌ చిరంజీవి ఖరీదైన బహుమతినిచ్చారు. కథానాయకుడిగా మొదటి ప్రయత్నంలోనే వైష్ణవ్‌ విజయం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన చిరు ఈ కానుక అందించారు. ఈ మేరకు ‘ఆచార్య’ షూట్‌ పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్న చిరంజీవి తాజాగా వైష్ణవ్‌ని కలిసి ఓ ఖరీదైన చేతి గడియారాన్ని బహుమతిగా అందించి.. అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోని వైష్ణవ్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చూస్తూ.. మామయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన చిత్రం ‘ఉప్పెన’. కృతిశెట్టి కథానాయిక. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టి సూపర్‌హిట్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు ప్రస్తుతం చిరు ‘ఆచార్య’లో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ఖమ్మం జిల్లా సింగరేణి గనుల్లో షూటింగ్‌ చేశారు. దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతిపై పోరును కథాంశంగా తీసుకుని సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని