Chiranjeevi: ఆప‌ద్బాంధ‌వుడితో స‌మానం - chiranjeevi helped to covid patients
close
Published : 21/05/2021 21:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chiranjeevi: ఆప‌ద్బాంధ‌వుడితో స‌మానం

ఇంట‌ర్నెట్ డెస్క్‌: కొవిడ్ సెకండ్ వేవ్ వ‌ల్ల ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు ప‌డుతున్నాయి. చికిత్స‌కు అవ‌స‌ర‌మైన డ‌బ్బులేక దాత‌ల సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. అలాంటి వారికి చేయూత‌నందిస్తున్నారు అగ్రకథానాయకుడు చిరంజీవి. ఇప్ప‌టికే ప‌లువురికి సాయం చేసి ఉదార గుణాన్ని చాటుకున్నారు. పెద్ద‌దిక్కు కోల్పోయిన కుటుంబాల‌కు అండ‌గా నిలిచారు. హిందూపూర్‌కి చెందిన కె.ప్ర‌సాద్ రెడ్డి కుటుంబానికి రూ.3 ల‌క్ష‌లు, క‌డ‌పకు చెందిన‌ ర‌వి ప్ర‌సాద్ కుటుంబానికి రూ.3 ల‌క్ష‌లు, విశాఖకు చెందిన కె. శ్రీనివాస రావు కుటుంబానికి రూ.2 ల‌క్ష‌లు, బీఎస్ఎస్ ప్ర‌సాద్ కుమార్ (శ్రీకాకుళం) కుటుంబానికి రూ.ల‌క్ష ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. స‌హాయం అందుకున్న వారు సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా చిరంజీవికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ‘‘స‌ర్  మమ్న‌ల్ని అన్ని విధాలుగా ఆదుకున్నారు. ఆయ‌న ఆప‌ద్బాంధవుడితో స‌మానం. కుటుంబ స‌భ్యుడిగా ఉంటాన‌ని ధైర్యాన్నిచ్చారు’’ అని తెలియ‌జేశారు సాయం పొందిన ఓ మ‌హిళ‌.







మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని