మెగాస్టార్‌.. మరోసారి చెప్పేశారు - chiranjeevi konidela shares temple set from acharya
close
Published : 06/01/2021 20:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెగాస్టార్‌.. మరోసారి చెప్పేశారు

‘ఆచార్య’లోని ఆలయ సెట్‌ వీడియో పంచుకున్న చిరు

హైదరాబాద్‌: గతంలో అధికారిక ప్రకటనకు ముందే సినిమా పేరును ‘ఆచార్య’ అని చెప్పిన మెగాస్టార్‌ చిరంజీవి నాలిక్కరుచుకున్న విషయం తెలిసిందే. ఎంతో రహస్యంగా ఉంచాలనుకున్న టైటిల్‌ను చిరు ప్రకటించడంతో చిత్రబృందం కాస్త నిరాశకు గురైంది. అయితే.. అప్పటి నుంచే సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇదిలా ఉండగా.. తాజాగా మెగాస్టార్‌ మరోసారి ఓ రహస్యాన్ని బయటపెట్టారు. ఈసారి అనుకోకుండా కాదు.. కావాలనే చేశారు. సినిమాకు హైలైట్‌గా నిలిచే ఓ ఆలయ సెట్‌కు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పంచుకున్నారాయన.

చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ పనులు హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్‌ డైరెక్టర్‌గా సురేశ్‌ సెల్వరాజన్‌ పనిచేస్తున్నారు. ఈమధ్యే.. చరణ్‌ సైతం ఈ సెట్‌ను పరిశీలించి సురేశ్‌ను మెచ్చుకున్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

ఇదీ చదవండి..

‘అల’రించిన సంగీత కచేరి.. ఇంకా చూడలేదా?
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని