త్వరలోనే  సెట్స్ పైకి ‘లూసిఫర్‌’ రీమేక్‌! - chiranjeevi lucifer remake movie to start very soon
close
Published : 16/03/2021 15:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

త్వరలోనే  సెట్స్ పైకి ‘లూసిఫర్‌’ రీమేక్‌!

ఇంటర్నెట్‌ డెస్క్: మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో వస్తోన్న ‘ఆచార్య’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరకుంది. అయితే ఆయన కథానాయకుడిగా మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్‌’ రీమేక్‌ చేస్తున్నారు. చిత్రానికి మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సినిమా ఏప్రిల్లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. సినిమా షూటింగ్‌ని ఆరు నెల్లల్లోనే పూర్తి చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం జనవరిలో జరిగిన సంగతి తెలిసిందే.

నటుడు సత్యదేవ్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళ చిత్రసీమకు చెందిన మోహన్ రాజా ‘హనుమాన్ జంక్షన్’ ద్వారా తెలుగుకు పరిచయమయ్యారు. ఇక్కడ విజయవంతమైన పలు సినిమాలను తమిళంలో రీమేక్‌ చేశారు. చిరంజీవి న‌టించిన ‘హిట్లర్‌‘ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ ప‌ని చేశాడు. ఇన్నాళ్లకు మెగాస్టార్‌ను డైరెక్ట్‌ చేసే అవకాశం రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని