చిరు-నయన్ అలా కనిపించబోతున్నారా? - chiranjeevi once again pair with nayanthara for lucifer remake
close
Updated : 05/01/2021 04:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు-నయన్ అలా కనిపించబోతున్నారా?

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబో సిద్ధమవుతోందా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మాలయాళ సూపర్‌ హిట్‌ ‘లూసిఫర్‌’ రీమేక్‌గా ఇది రూపొందనుంది. ఇప్పటికే నటీనటులు, సాంకేతిక బృందం ఎంపిక చేసే పనిలో ఉంది యూనిట్‌. ఈ కథలోని స్టార్‌ హీరోయిన్‌ నయనతారను తీసుకోవాలని దర్శకుడు మోహనరాజా అనుకుంటున్నారట. అయితే, చిరంజీవికి జోడీగా మాత్రం కాదండోయ్‌. ఆయన సోదరిగానని టాక్‌. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్‌ సర్కిల్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

‘లూసిఫర్‌’లో మంజు వారియర్‌ బలమైన పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. కథ ప్రకారం అందులో మోహన్‌లాల్‌ సోదరిగా కనిపిస్తారు. ఇప్పుడు తెలుగు రీమేక్‌లో ఆ పాత్ర కోసం నయన్‌ను తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నారట. బలమైన భావోద్వేగాలు కలిగిన ఆ పాత్రకు లేడీ సూపర్‌స్టార్‌ సరిగ్గా సరిపోతుందని అనుకుంటున్నారు. దీనిపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. చిరు నటించిన ‘హిట్లర్‌’ తాజాగా 24 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోహన్‌ రాజా ట్వీట్‌ చేస్తూ, ‘మెగాస్టార్153 అప్‌డేట్‌ త్వరలోనే ఇస్తా’ అంటూ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సినిమాలో సత్యదేవ్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ‘లూసిఫర్‌’ రీమేక్‌ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇవీ చదవండి..

లేడీ విజయసేతుపతిలా ఉండాలనుకుంటున్నా!

రకుల్‌ సూక్తులు.. వేదిక మ్యాజిక్కులు మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని