Chiranjeevi: మాట నిలబెట్టుకున్న మెగాస్టార్‌ - chiranjeevi oxygen banks services starts from today
close
Updated : 26/05/2021 16:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chiranjeevi: మాట నిలబెట్టుకున్న మెగాస్టార్‌

యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్‌ బ్యాంక్‌లు

హైదరాబాద్‌: ‘బ్లడ్‌బ్యాంక్‌’, ‘ఐబ్యాంక్‌’ వేదికలుగా ఇంతకాలం ఎంతోమందికి సాయం అందించిన మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి మాట నిలబెట్టుకున్నారు. కరోనా బారినపడి సమయానికి ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోతున్న వారి కోసం చెప్పినట్టుగానే ‘చిరు ఆక్సిజన్‌ బ్యాంక్‌’లను ఆయన అందుబాటులోకి తీసుకువచ్చారు. తెలుగు రాష్ట్రాలోని చాలా జిల్లాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆయన ఇటీవల తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా బుధవారం ఉదయం అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ‘చిరు ఆక్సిజన్‌ బ్యాంక్‌’ సేవలు ప్రారంభమయ్యాయి.

ఈ విషయం గురించి చిరు మాట్లాడుతూ.. ‘‘అనుకున్న ప్రకారం వారం రోజులలోపే వందలకొద్ది ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్‌సన్‌ట్రేటర్లు సంపాదించాం. అనంతపురం, గుంటూరు జిల్లాల్లో బుధవారం నుంచి ‘చిరు ఆక్సిజన్‌ బ్యాంక్‌’ సేవలు ప్రారంభమవుతున్నాయి. గురువారం నుంచి ఖమ్మం, కరీంనగర్‌లతోపాటు మరో ఐదు జిల్లాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆక్సిజన్‌ అందక ఎవరూ ఇబ్బందిపడకూడదు. ఇన్ని ఆక్సిజన్‌ సిలిండర్లు సంపాదించడానికి రామ్‌చరణ్‌ కూడా ఎంతో కృషి చేశాడు. నాకెంతో సంతోషంగా ఉంది’’ అని చిరు పేర్కొన్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని