కామన్‌ డీపీ కాదు... కామన్‌ మోషన్‌ పోస్టర్‌ - chiranjeevi pr team making a common motion poster
close
Published : 12/08/2020 02:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కామన్‌ డీపీ కాదు... కామన్‌ మోషన్‌ పోస్టర్‌

హైదరాబాద్‌: అభిమాన కథానాయకుడి పుట్టిన రోజు అయితే అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఒకప్పుడు కేక్‌ కటింగ్‌లు, కటౌట్లకు దండలు, భోజనాలు, పూజలు, అర్చనలు అబ్బో ఓ రేంజిలో ఉండేది. అయితే ఇప్పుడు అంతా ఆన్‌లైన్‌, సోషల్‌ మీడియాలోకి వచ్చేసింది. ట్విటర్‌లో హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చిందా... కామన్‌ డీపీ ట్రెండింగ్‌లో ఉందా? అనే చూస్తున్నారు. వీటికి ఇంకాస్త అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ తీసుకురావాలని చిరంజీవి అభిమానులు చూస్తున్నారట.

హీరో పుట్టిన రోజు అనగా కామన్‌ డీపీ (డిస్‌ప్లే పిక్చర్‌) రిలీజ్‌ చేయడం ఇటీవల కాలంలో బాగా పెరిగిన అనవాయితీ. చిరంజీవి పుట్టిన రోజుకు దీనికి కాస్త డెవలప్‌ చేసి కామన్‌ మోషన్‌ పోస్టర్‌ తీసుకొస్తారట. దీని కోసం చిరంజీవి పీఆర్‌ టీమ్‌ ఓ వీడియోను రూపొందించిందట. చిరంజీవి పుట్టిన రోజుకు వారం ముందు అంటే ఆగస్టు 15న దీనిని విడుదల చేస్తారని టాలీవుడ్‌ భోగట్టా. ఇండస్ట్రీలోని 65 మంది ప్రముఖులతో దీనిని సోషల్‌ మీడియాలో పెట్టించాలని చూస్తున్నారట.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని