Kalyandevకి కరోనా - chiranjeevi son in law and actor kalyandev tested positive for covid
close
Published : 22/04/2021 17:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kalyandevకి కరోనా

హైదరాబాద్‌: చిరంజీవి చిన్నల్లుడు, నటుడు కల్యాణ్‌దేవ్‌ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా కల్యాణ్‌దేవ్‌ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘స్వల్ప లక్షణాలు కనిపించడంతో బుధవారం కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నేను ఆస్పత్రిలోనే క్వారంటైన్‌లో ఉన్నాను. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తా’ అని ఆయన పేర్కొన్నారు. కల్యాణ్‌ పెట్టిన పోస్ట్‌ పై స్పందించిన నాగబాబు.. ‘నువ్వు త్వరగా కోలుకోవాలి. కోలుకుంటావు అని ఆశిస్తున్నా’ అని రిప్లై ఇచ్చారు. నటి అవికాగౌర్‌ స్పందిస్తూ.. ‘ఓ మై గాడ్‌!! జాగ్రత్తగా ఉండండి’ అని తెలిపారు.

‘విజేత’తో కల్యాణ్‌దేవ్‌ హీరోగా పరిచయమయ్యారు. ప్రస్తుతం ఆయన ‘సూపర్‌మచ్చి’, ‘కిన్నెరసాని’ చిత్రాల్లో నటిస్తున్నారు. దీనితోపాటు పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఓ సరికొత్త ప్రేమకథా చిత్రంలోనూ కల్యాణ్‌దేవ్‌ హీరోగా కనిపించనున్నారు. ఆ సినిమాలో కల్యాణ్‌కు జంటగా అవికా సందడి చేయనున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని