‘ఆచార్య’ టీజర్‌: చిరు-కొరటాల ఫన్నీ టాక్‌ - chiru and koratala siva funny memes about acharya teaser release
close
Updated : 27/01/2021 03:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆచార్య’ టీజర్‌: చిరు-కొరటాల ఫన్నీ టాక్‌

హైదరాబాద్‌: చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్‌ కథానాయిక. రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌, గుడి సెట్‌ వీడియో, సిద్ధగా రామ్‌చరణ్‌ బ్యాక్‌లుక్‌ మినహా ఈ సినిమాకు సంబంధించిన ఏ విశేషాన్ని చిత్ర బృందం అభిమానులతో పంచుకోలేదు. ఈ నేపథ్యంలో టీజర్‌ ఎప్పుడు విడుదల చేస్తారా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా దీనిపై చిరు-కొరటాల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఫన్నీ మీమ్‌ను మెగాస్టార్ ఇదిగో ఇలా అభిమానులతో పంచుకున్నారు.

ఆచార్య’ టీజర్‌ ఎప్పుడు విడుదల చేస్తారో బుధవారం ఉదయం 10గంటలకు వెల్లడించనున్నారు. ప్రస్తుతం ఈ మీమ్‌ సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండింగ్‌లో ఉంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని