చిరు పుట్టిన రోజున ఏ వార్త చెబుతారో..! - chiru new movie update will be on his birthday
close
Published : 06/08/2020 10:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు పుట్టిన రోజున ఏ వార్త చెబుతారో..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ తారల పుట్టిన రోజు సందర్భంగా వారి కొత్త సినిమాలకు సంబంధించిన విశేషాలు ప్రకటించడం సంప్రదాయంగా మారిపోయింది. దీంతో ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు(ఆగస్టు 22) కోసం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. చిరంజీవి ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత మలయాళ చిత్రం ‘లూసిఫర్‌’ రీమేక్‌లో నటిస్తారని తెలుస్తోంది. మొదట్లో ‘లూసిఫర్‌’కు యువ దర్శకుడు సుజీత్‌ దర్శకత్వం వహిస్తారని చిరునే ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం వి.వి. వినాయక్‌ వద్దకు వెళ్లిందని సమాచారం. అదే సమయంలో దర్శకుడు బాబీ చెప్పిన కథ చిరంజీవికి బాగా నచ్చిందట. దీంతో బాబీ స్క్రిప్టు పనుల్లో నిమగ్నమయ్యాడు. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. 

అయితే మరికొన్ని రోజుల్లో చిరంజీవి పుట్టిన రోజు రాబోతుంది. ఈ పుట్టిన రోజున చిరు నుంచి ఏ సినిమా వార్త రాబోతుందోనని అభిమానులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ‘ఆచార్య’ చిత్రబృందం నుంచి అధికారికంగా చిరు ఫస్ట్‌లుక్‌ లేదా టీజర్‌ లాంటిది ఏదైనా విడుదల చేస్తారేమోనని భావిస్తున్నారు. మరోవైపు ‘లూసిఫర్‌’ రీమేక్‌ బాధ్యతలు ఈ మధ్యే వి.వి. వినాయక్‌ తీసుకోవడంతో దీని స్క్రిప్టు పనులకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. బాబీ కథ సిద్ధంగా ఉండటంతో ‘లూసిఫర్‌’ కంటే ముందు బాబీ దర్శకత్వంలోనే సినిమా చేస్తాడని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఈ మూడు చిత్రాలకు సంబంధించి చిరంజీవి ఏ వార్త చెబుతారో తెలియాలంటే ఆయన పుట్టిన రోజు వరకు వేచి చూడాల్సిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని