#చిరు ట్వీట్స్‌ : ఈ వీడియో చూశారా! - chiru tweets sunrise vedio at his house
close
Updated : 15/02/2021 13:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

#చిరు ట్వీట్స్‌ : ఈ వీడియో చూశారా!

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరు ఇటీవల సోషల్‌ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటున్నారో తెలిసిందే. స్వయంగా ఆయనే తన ఇంటి పరిసరాల్లోని ఆహ్లదకరమైన దృశ్యాలను చరవాణిలో చిత్రీకరించి అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఒక అద్భుతమైన సూర్యోదయ దృశ్యాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

‘ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు, శతాబ్దాలు గడిచినా.. ఖగోళ అందాలైన సూర్యోదయ, సూర్యాస్తమయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఆ క్షణాలు ఎంతో ఆనందాన్నిస్తాయి. మా ఇంటి ఆవరణలో ఆవిష్కృతమైన అటువంటి ఓ అందమైన ఉదయాన్ని మీతో పంచుకుంటున్నాను’ అనే వ్యాఖ్యను జత చేశారు.

సన్‌రైజ్‌ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం మెగాస్టార్‌ ప్రధాన పాత్రలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ సినిమా మే 14న థియేటర్లలోకి రానుంది. ఆ తర్వాత వరుసగా ‘లూసిఫర్‌’ ‘వేదాళం’ తెలుగు రీమేక్‌లలో చిరు నటించనున్నారు. ఆ తర్వాత డైరెక్టర్‌ బాబీతో సినిమా చేయనున్నారు. మరి మెగాస్టార్‌ చిరు షేర్‌ చేసిన ఆ అందమైన ఉదయాన్ని వీక్షించండి!

ఇవీ చదవండి!

పొద్దు తిరుగుడు చేనులో వాణి.. విజయ్‌తో సారా

‘రాధేశ్యామ్‌’ విడుదల ఖరారు
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని