close
Published : 06/03/2021 18:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘అరణ్య’ నుంచి అడవి గీతం

ఇంటర్నెట్‌ డెస్క్‌: రానా దగ్గుబాటి కీలక పాత్రలో ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అరణ్య’. కొంతమంది స్వార్థపరులు చేసే పనుల కారణంగా అడవులు, అందులోని జంతువులు ముఖ్యంగా ఏనుగులు ఎలా మనుగడ కోల్పోతున్నాయన్న దాన్ని ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక పాటను చిత్రబృందం విడుదల చేసింది. అరణ్య గీతం పేరుతో ఆ వీడియోను అభిమానులతో పంచుకుంది. ‘చిటికేసే ఆ చిరుగాలి’ అంటూ గూడెం ప్రజలు పాడుకుంటూ సాగే పాట మనసుకు హత్తుకునేలా ఉంది. ఈ పాటను వనమాలి రచించగా.. హరిచరణ్‌ ఆలపించారు. ఆలస్యమెందుకు మీరూ చూసేయండి మరి.!

హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాదన్’ పేర్లతో విడుదల కానుంది. ఏరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మిస్తోంది. విష్ణు విశాల్‌, జోయా హస్సేన్‌, శ్రీయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతను సంగీతం అందించారు. చిత్రీకరణ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని