గంగ‌వ్వ చెప్పిన ‘చోర గాథ’ విన్నారా! - chora gaadha by gangavva from Sree Vishnu Raja Raja Chora movie
close
Published : 11/06/2021 17:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గంగ‌వ్వ చెప్పిన ‘చోర గాథ’ విన్నారా!

ఇంట‌ర్నెట్ డెస్క్‌: శ్రీవిష్ణు కథానాయకుడిగా హసిత్‌ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాజ రాజ చోర’. మేఘా ఆకాష్, సునయన కథానాయికలు. ‘చోర గాథ బై గంగ‌వ్వ‌’ పేరుతో ఓ ప్రత్యేక వీడియోను చిత్ర బృందం తాజాగా విడుద‌ల చేసింది. ఇందులో ‘నీకు ఊ.. కొట్టే క‌థ తెలుసా? ఏది చెప్పినా ఊ.. కొట్టాలి’ అని అస‌లు క‌థ మొద‌లు పెడుతుంది గంగ‌వ్వ‌. ‘‘అన‌గ‌న‌గా ఓ సూర్యుడుండేటోడు. ఆ సూర్య‌డేమో భూమికి ప్రాణం ఇచ్చాడు. భూమి నుంచి కోతి, బంగారం వచ్చాయి’’ అంటూ ఆద్యంతం ఆస‌క్తిగా సాగింది. మొత్తం క‌థ చెప్ప‌డం కన్నా గంగ‌వ్వ మాట‌ల్లో వింటేనే బాగుంటుంది. రాజు, దొంగ‌, కిరీటం ఈ మూడింటి మధ్య ఏం జరిగిందనేది కథ. రాజు కిరీటాన్ని ఎత్తుకెళ్లిన‌ ఆ దొంగ దొరుకుతాడా? లేదా? అనే ప్ర‌శ్న‌తో ముగించిన ఈ క‌థ సినిమాపై ఆస‌క్తి పెంచుతోంది. విభిన్న క‌థాంశంతో రూపొందుతోన్న ఈ చిత్ర టీజ‌ర్ జూన్‌ 18న విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు.  తనికెళ్ల భరణి, రవిబాబు, కాదంబరి కిరణ్, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న  ఈ  చిత్రానికి వివేక్‌ సాగర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని