Chris Woakes on IPL: ఏదో ఒకదాన్ని వదులు కోవాల్సిందే : క్రిస్‌ వోక్స్‌  - chose world cup and ashes over ipl says woakes
close
Published : 14/09/2021 21:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chris Woakes on IPL: ఏదో ఒకదాన్ని వదులు కోవాల్సిందే : క్రిస్‌ వోక్స్‌ 

ఇంటర్నెట్‌ డెస్కు : వరుస సిరీస్‌లతో ఆటగాళ్లు తీరిక లేకుండా ఉన్నారని.. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని ఫార్మాట్లలో ఆడటం కష్టమని ఇంగ్లాండ్‌ పేసర్‌ క్రిస్‌ వోక్స్‌ అన్నాడు. అందుకే తాను త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) నుంచి తప్పుకున్నట్లు తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌, యాషెస్‌ టెస్టు సిరీస్‌ల్లో వోక్స్ ఇంగ్లాండ్ తరఫున ఆడనున్నాడు. 

‘కొద్ది రోజుల క్రితం వరకు నేను టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉంటానని ఊహించలేదు. జట్టులో చోటు దక్కడంతో దేశం తరఫున ఆడేందుకు ఐపీఎల్‌ నుంచి వైదోలగాల్సి వచ్చింది. పైగా, వెంట వెంటనే కీలక సిరీస్‌లు ఉండటం కూడా ఒక కారణం. స్వల్ప వ్యవధిలోనే ఐపీఎల్, టీ20 ప్రపంచకప్‌, యాషెస్‌ సిరీస్‌లు ఉన్నాయి. దీంతో ఆటగాళ్లు తక్కువ సమయంలో ఎక్కువ మ్యాచులు ఆడాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక టోర్నీని వదులుకోవాల్సిందే’ అని క్రిస్‌ వోక్స్ తెలిపాడు. అతడు గతంలో దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడిన విషయం తెలిసిందే. మరో ఇద్దరు ఇంగ్లాండ్ ఆటగాళ్లు జానీ బెయిర్‌ స్టో(సన్‌రైజర్స్ హైదరాబాద్‌), డేవిడ్‌ మలన్‌(పంజాబ్‌ కింగ్స్‌)లు కూడా ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని