మోదీకి కృతజ్ఞతలు తెలిపిన క్రిస్‌ గేల్ - chris gayle thanks india for sending covid 19 vaccine to jamaica
close
Updated : 19/03/2021 17:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోదీకి కృతజ్ఞతలు తెలిపిన క్రిస్‌ గేల్

కింగ్‌స్టన్‌: కరేబియన్‌ దీవుల్లోని పలు దేశాలకు కరోనా టీకా అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, భారత ప్రజలకు యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ కృతజ్ఞతలు తెలిపాడు. తమ దేశానికి ఉచితంగా కొవిడ్‌ వ్యాక్సిన్లు సరఫరా చేసినందుకు ధన్యవాదాలు తెలిపాడు. కాగా ఆ వీడియోను జమైకాలోని భారత హై కమిషన్‌ ట్విటర్‌ ద్వారా పంచుకుంది. భారత హై కమిషనర్‌ ఆర్‌.మసాకుయ్‌ను కలిసిన గేల్‌ ఆయనకు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ ఫొటోలను షేర్‌ చేశాడు. ‘వ్యాక్సిన్‌ మైత్రి’ పేరిట కొవిడ్‌ టీకాలను భారత్‌ పలు దేశాలకు సరఫరా చేస్తోంది. ఇటీవలే కరేబియన్‌ ప్రాంతాలైన ఆంటిగ్వా, బార్బుడా, జమైకాకు టీకా డోసులను పంపిణీ చేసింది. 

ఆండ్రూ రస్సెల్‌ కూడా ప్రధాని మోదీకి బుధవారం కృతజ్ఞతలు తెలిపాడు. ‘ప్రధాని మోదీ, భారత హై కమిషన్‌కు చాలా చాలా ధన్యవాదాలు. మాకు వ్యాక్సిన్లు అందాయి. భారత దాతృత్వాన్ని జమైకా ప్రజలు అభినందిస్తున్నారు. ప్రపంచం సాధారణ స్థితికి వస్తే చూడాలని ఆతృతతో ఉన్నా’ అని రస్సెల్‌ ఓ వీడియోలో పేర్కొనగా జమైకాలోని భారత కార్యాలయం దానిని ట్విటర్‌లో పోస్టు చేసింది. విండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ సహా పలువురు విండీస్‌ మాజీలు సైతం భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని