సచిన్‌లా నేనుంటే.. ఎంతో సంతోషించేవాడిని   - chris tremlett praises sachin tendulkars fitness
close
Published : 12/03/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సచిన్‌లా నేనుంటే.. ఎంతో సంతోషించేవాడిని 

ఇంగ్లాండ్‌ మాజీ బౌలర్‌ క్రిస్‌ ట్రెమ్‌లెట్‌..

(Photo: Chris Tremlett)

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ అంత ఫిట్‌నెస్‌తో తానుంటే చాలా సంతోషంగా ఉంటానని ఇంగ్లాండ్‌ మాజీ బౌలర్‌ క్రిస్‌ ట్రెమ్‌లెట్‌ అన్నాడు. రోడ్‌ సేఫ్టీ సిరీస్‌లో భాగంగా ఇండియా లెజెండ్స్‌, ఇంగ్లాండ్‌ లెజెండ్స్‌ జట్లు తాజగా పోటీపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కెవిన్‌ పీటర్సన్‌ టీమ్‌ 6 పరుగులతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఆటగాళ్ల కోసం ఏర్పాటు చేసిన జిమ్‌లో సచిన్‌, ట్రెమ్‌లెట్‌ కలిసి ఒక ఫొటో దిగారు. మాస్టర్‌ బ్లాస్టర్‌ భుజాలపై చేయివేసి ట్రెమ్‌లెట్‌ పక్కనే నిల్చున్నాడు.

దాన్ని ట్విటర్‌లో పంచుకున్న ఇంగ్లాండ్‌ మాజీ బౌలర్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ‘సచిన్‌ ఇప్పుడున్న వయసులో ఎంత దృఢంగా ఉన్నాడో.. నేనూ ఒకవేళ ఆ వయసులో అంత దృఢంగా ఉంటే ఎంతో సంతోషంగా ఉండేవాడిని’ అని ట్వీట్‌ చేశాడు. సచిన్‌కు ఇప్పుడు 47 ఏళ్లు కాగా, ట్రెమ్‌కు 39 ఏళ్లు. ఇద్దరూ 2013లో చివరిసారి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడారు. మరోవైపు సచిన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సరదా వీడియో పంచుకొని అభిమానులను అలరించాడు. వివిధ జట్లతో క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడుతున్న నేపథ్యంలో ఆటగాళ్లకు అక్కడ కరోనా పరీక్షలు చేయగా, లిటిల్‌ మాస్టర్‌ సైతం చేయించుకున్నాడు. అయితే, మెడికల్‌ సిబ్బంది అతడి శ్వాసకోశ నాళంలో నుంచి స్వాబ్‌ టెస్టు చేశాక ముక్కులో నొప్పి కలిగినట్లు సిబ్బందిని ఆటపట్టించాడు. దాన్ని అభిమానులతో పంచుకొని మాస్టర్‌బ్లాస్టర్‌ సంబరపడ్డాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని