విచిత్రం: సిగరెట్లను నిషేధించాలంటున్న సిగరెట్ల సంస్థ! - cigarettes company ceo calls to ban on cigaretts
close
Published : 26/07/2021 23:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విచిత్రం: సిగరెట్లను నిషేధించాలంటున్న సిగరెట్ల సంస్థ!

లండన్‌: ఏ కంపెనీ అయినా తమకు నష్టాలపాలయ్యే వ్యాఖ్యలు చేయదు. కానీ, ఓ సిగరెట్ల కంపెనీ ఏకంగా సిగరెట్లను నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. వివరాల్లోకి వెళితే.. ఫిలిప్‌ మొర్రీస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఉత్పత్తి చేసే మార్ల్‌బోరో బ్రాండ్‌ సిగరెట్లు ప్రపంచవ్యాప్తంగా భారీగా అమ్ముడుపోతుంటాయి. సిగరెట్లు ఆరోగ్యానికి హానికరమని తెలిసినా.. తాగేవారు చాలా మంది ఉన్నారు. అందుకే ఈ కంపెనీ లాభాల బాటలో కొనసాగుతోంది. అయితే, తాజాగా ఈ సంస్థ సిగరెట్లను నిషేధించాలని యూకే ప్రభుత్వానికి సూచించింది. పదేళ్లలో యూకేలో సిగరెట్లు లేకుండా చేయాలని చెబుతోంది. ఈ మేరకు ఆ కంపెనీ సీఈవో జాసెక్‌ ఒల్జాక్‌ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 

‘‘మా సంస్థ సిగరెట్లు లేని ప్రపంచాన్ని చూడాలనుకుంటోంది. త్వరలోనే అది జరుగుతుంది. అది అందరి మంచికే’’అని జాసెక్‌ ఒల్జాక్‌ అన్నారు. పెట్రోల్‌ కార్లను 2030 నుంచి నిషేధించబోతున్నారని.. సిగరెట్లను కూడా అలాగే నిషేధించాలని చెప్పారు. అయితే, ప్రస్తుతం సిగరెట్లకు ఉన్న ఇతర ప్రత్యామ్నాయాలు(ఎలక్ట్రానిక్‌ సిగరెట్లు, చూయింగ్‌గమ్‌ తదితర) దారుణంగా ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారట. అందుకే, ప్రజలకు పొగరహిత సిగరెట్‌ ప్రత్యామ్నాయాలు ఇవ్వాల్సిన అవసరముందని జాసెక్‌ తెలిపారు. ఇది వచ్చే పదేళ్లలో కొన్ని దేశాల్లో జరగబోతుందని జోస్యం చెప్పారు. సిగరెట్‌ రహిత ప్రపంచం కోసం తమ సంస్థను ‘హెల్త్‌కేర్‌ అండ్‌ వెల్‌నెస్‌’ కంపెనీగా మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. 

ఫిలిప్‌ మొర్రీస్‌ ఇంటర్నేషనల్‌పై విమర్శలు

నిజానికి యూకేలోని అనేక పొగాకు సంస్థలు సిగరెట్ల తయారీని నిలిపివేసి వాటికి ప్రత్యామ్నాయంగా వేప్స్‌, ఈ-సిగరెట్లు తయారు చేయాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఫిలిప్‌ మొర్రీస్‌ ఇంటర్నేషనల్‌ కూడా ఈ-సిగరెట్లను తయారు చేయబోతుంది. తాజాగా జాసెక్‌ చేసిన వ్యాఖ్యలపై సిగరెట్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్యకర్తలు మండిపడుతున్నారు.  ఒకవైపు సిగరెట్‌ రహిత ప్రపంచాన్నికి పరిష్కారం చూపుతామంటూనే సిగరెట్లను భారీగా విక్రయిస్తున్నారని ఆక్షేపించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని