మాల్దీవ్స్‌ కాదు మహారాజపురం.. సామ్‌ సాగరకన్య - cinema celebreties posts on Social Media Handles
close
Published : 25/11/2020 16:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాల్దీవ్స్‌ కాదు మహారాజపురం.. సామ్‌ సాగరకన్య

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన సినీ తారలు సామాజిక మాధ్యమాల్లో చురుకుగా కనిపిస్తుంటారు. తమను అమితంగా ఆకట్టుకున్న సంఘటనలు, ప్రాంతాలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకు చేరవేస్తుంటారు. అలా నిత్యం అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. మరి ఈరోజు సినీ తారలు ఎలాంటి పోస్టులు చేశారో ఓసారి చూద్దామా..?

తన కూతురు సితారతో కలిసి టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు షాపింగ్‌కు వెళ్లారు. దానికి సంబంధించిన ఫొటోను సితార సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. త్వరగా వచ్చేయండి అంటూ సితార తల్లి నమ్రత కామెంట్‌ చేశారు.

తన తర్వాతి సినిమాకు సిద్ధమవుతోన్న తాప్సీ పన్ను సాధనకు సంబంధించిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది.

► మాల్దీవ్స్‌ కాదు మహారాజపురం అంటూ నటి అదాశర్మ ఓ వీడియోను పోస్టు చేసింది.

జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న ఓ వీడియోను నటి, నిర్మాత ఛార్మి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

మాల్దీవుల్లో ఉన్న సమంత ఓ ఫొటోను షేర్‌ చేసింది. దానికి సాగరకన్య ఎమోజీని జత చేసింది.

మెగా బ్రదర్‌ నాగబాబు కూడా ఓ పోస్టు చేశారు. రక్తదానం చేస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

కొత్త పెళ్లి కూతురు కాజల్‌ అగర్వాల్‌ హనీమూన్‌ను ఆస్వాదిస్తోంది. సముద్రం మధ్యలో ఆహారం తింటూ ఓ ఫొటో పోస్టు చేసింది.

కాజల్‌ భర్త గౌతమ్‌ కిచ్లూ ఓ పోస్టు చేశారు. తన భార్య కాజల్‌ చేతిని తన చేతిలో పెట్టుకొని ఉన్న ఆ ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న మెగా డాటర్‌ నిహారిక కొవిడ్‌ పాఠాలు చెబుతోంది.

కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో ఉన్న ఓ ఫొటోను నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ అభిమానులతో పంచుకుంది. ఆ పోస్టుపై మంచులక్ష్మి స్పందించారు.

►   బాలీవుడ్‌ నటి తన కొడుకు తైమూర్ అలీ ఖాన్‌కు కుండలు చేయడం నేర్పిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె అభిమానులతోపంచుకుంది.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని