పవన్‌తో రానా ‘ఢీ’.. వెన్నెలగా సాయి పల్లవి - cinema celebrities interesting social media posts on january 28th
close
Published : 29/01/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌తో రానా ‘ఢీ’.. వెన్నెలగా సాయి పల్లవి

* పవన్‌కల్యాణ్‌-రానా కీలక పాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే మొదలైంది. గురువారం నుంచి రానా ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నారని చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

* బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా క్రికెట్‌ ఆడుతూ సరదాగా గడుపుతున్నారు.

* నటి శ్రద్ధాదాస్‌ జంక్‌ఫుడ్‌ తిందామనుకున్న ప్రతిసారీ అంతరాత్మ అడ్డుచెబుతోందట. చిప్స్‌ తిందామని తెరిచిన డబ్బాను బాధపడుతూ పక్కన పెట్టేశారు.

* రానా కథానాయకుడిగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాట పర్వం’. సాయి పల్లవి కథానాయిక. ఇందులో ఆమె వెన్నెల అనే పాత్ర పోషిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అంతేకాదు, లుక్‌ను కూడా పంచుకుంది. ఏప్రిల్‌ 30న ఈ సినిమా విడుదల కానుంది.

* కథానాయిక నిక్రీ గల్రాని కోతులతో సరదాగా గడిపారు. వాటికి బిస్కెట్లు అందిస్తూ తెగ సంబరపడిపోయారు. అందుకు సంబంధించిన వీడియోను ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఇలా మన సినీతారలు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్న విశేషాలు మీకోసం..

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని