థ్యాంక్స్‌ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి - cinema celebrity social media posts
close
Published : 27/02/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

థ్యాంక్స్‌ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్: సమంత  తెరంగ్రేటం చేసి గురువారంతో 11 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమెకు అవకాశం ఇచ్చిన ‘ఏమాయ చేసావె’ చిత్ర బృందానికి సామాజిక మాధ్యమాల వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. తొలిపాత్ర జెస్సీ ఆమెకు ఎంతో పేరు తెచ్చినపెట్టిన సంగతి తెలిసిందే.

* నేను మాట్లాడే దానికి మాత్రమే బాధ్యత వహించగలను. కానీ, మీరు ఏం అర్థం చేసుకుంటారో దానికి కాదు అంటున్నారు నాయిక కాజల్‌ అగర్వాల్‌. 

* నిన్న, రేపు, మరో రోజు కాదు.. ఇప్పుడే ఇక్కడే అనుకుంటేనే రాణిస్తాం అని రాసుకొచ్చారు మహేశ్‌ బాబు సతీమణి, నటి నమ్రతా శిరోద్కర్‌. దీంతోపాటు ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

* పగలు, రాత్రి తేడా లేకుండా ఇలా ఎందుకు? అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం చెప్తా అంటూ తాను నిద్రపోతున్న ఫొటోని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు నివేదా థామస్‌.

* ఓ సినిమా చిత్రీకరణ కోసం కొచ్చి వెళ్లారు రాశీఖన్నా. ఆ ప్రాంతం అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. అక్కడి అందమైన లొకేషన్‌లో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకున్నారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని