‘టైగర్‌’ కలయికలో... - cinema
close
Published : 08/05/2021 09:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘టైగర్‌’ కలయికలో...

సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో మరో చిత్రం రూపొందనుంది. ఇదివరకు వీరిద్దరూ కలిసి ‘టైగర్‌’ చేశారు. నటన పరంగా ఆ చిత్రం సందీప్‌కిషన్‌కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఆ కలయికలో చిత్రం ఖరారైంది. శుక్రవారం సందీప్‌కిషన్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ చిత్రం వివరాల్ని ప్రకటించారు. అతీంద్రీయ శక్తులు, ఫాంటసీ అంశాలతో కూడిన కథతో ఈ చిత్రం రూపొందనుంది. రాజేష్‌ దండ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ కొవిడ్‌ ప్రభావం తగ్గిన వెంటనే ప్రారంభిస్తారు. సందీప్‌కిషన్‌కి ఇది 28వ చిత్రం.
* పుట్టెనే ప్రేమ...: సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా జి.నాగేశ్వర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘గల్లీ రౌడీ’. నేహాశెట్టి నాయిక. ఈ చిత్రంలోని ‘పుట్టెనే ప్రేమ... పడగొట్టెనే ప్రేమ... ’ అంటూ సాగే గీతాన్ని శుక్రవారం విడుదల చేశారు. భాస్కరభట్ల రచించిన ఈ గీతాన్ని రామ్‌ మిర్యాల స్వరపరచడంతోపాటు ఆలపించారు.Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని