ఆగిన కలం - cinema
close
Published : 17/05/2021 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆగిన కలం

 గేయ రచయిత అదృష్టదీపక్‌ కన్నుమూత

‘మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం’ అంటూ.. ‘నేటి భారతం’ సినిమాలో ఆయన కలం కూర్చిన అక్షర సుమాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. అభ్యుదయ భావజాలంతో సాహితీ సభల్లో భావితరానికి దిశా
నిర్దేశం చేసిన ఆయన గళం.. శాశ్వతంగా మూగవోయింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నివాసి, సినీ గేయ రచయిత సి.అదృష్టదీపక్‌(71) కన్నుమూశారు. గత నాలుగు రోజులుగా కరోనాతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందారు. 1950 జనవరి 18న రావుల పాలెంలో జన్మించిన దీపక్‌ అధ్యాపకుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. అదృష్టదీపక్‌ అసలు పేరు అదృష్టదీప రామకృష్ణారెడ్డి. ఆయన కోకిలమ్మ పదాలు, అగ్ని, సమరశంఖం, ప్రాణం, దీపకరాగం లాంటి రచనలు చేశారు. 1980లో మాదాల రంగారావు ద్వారా ‘యువతరం కదిలింది’ చిత్రంలో.. ‘ఆశయాల పందిరిలో..’ గీత రచనతో సినిమా రంగ ప్రవేశం చేశారు. విప్లవశంఖం, నవోదయం, నేటిభారతం, దేశంలో దొంగలుపడ్డారు, ప్రజాస్వామ్యం, నవభారతం, భారతనారి, ఎర్రమందారం, అన్న, మా ఆయన బంగారం, దేవాలయం, వందేమాతరం, అర్ధరాత్రి స్వతంత్రం, కంచుకాగడా, జైత్రయాత్ర, స్వరాజ్యం, బదిలీ, సగటు మనిషి, నవయుగం తదితర చిత్రాలకు పాటలు రాశారు. ఆయనకు భార్య స్వరాజ్యం, కూతురు కిరణ్మయి, కొడుకు చక్రవర్తి ఉన్నారు.

- న్యూస్‌టుడే, రామచంద్రపురం


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని