Varuntej: ‘గని’ కోసం.. హాలీవుడ్‌ నుంచి! - cinema
close
Updated : 27/05/2021 06:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Varuntej: ‘గని’ కోసం.. హాలీవుడ్‌ నుంచి!

రుణ్‌తేజ్‌ కథానాయకుడిగా తెర కెక్కుతున్న చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం  అవుతున్నారు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మాతలు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా రెండో దశ కరోనా ఉద్ధృతితో ఆగిపోయింది. త్వరలోనే చిత్రీకరణని పునః ప్రారంభిస్తారు. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. సినిమా కోసం ఈ విరామంలోనూ వరుణ్‌తేజ్‌ బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. తదుపరి షెడ్యూల్‌లో కీలకమైన పోరాట ఘట్టాల్ని తెరకెక్కించనున్నట్టు చిత్రబృందం తెలిపింది. హాలీవుడ్‌కి చెందిన లార్నెల్‌ స్టోవల్‌, వ్లాడ్‌ రింబర్గ్‌ నేతృత్వంలో తెరకెక్కించనున్న ఆ పోరాటాల కోసం ఓ స్టేడియం సెట్‌నీ తీర్చిదిద్దారు. లార్నెల్‌, వ్లాడ్‌ ఇదివరకు ‘టైటాన్స్‌’, ‘సుల్తాన్‌’ తదితర చిత్రాలకి యాక్షన్‌ ఘట్టాల్ని డిజైన్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సిద్ధు ముద్ద మాట్లాడుతూ ‘‘70 శాతం చిత్రీకరణని పూర్తి చేసుకున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ కోసం పక్కా ప్రణాళికల్ని సిద్ధం చేశాం. భారీ స్టేడియం సెట్‌ని నిర్మించాం. అత్యున్నత ప్రమాణాలతో, హాలీవుడ్‌ నిపుణులతో తెరకెక్కించనున్న పోరాట ఘట్టాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పరిస్థితులు అనుకూలించిన వెంటనే చిత్రీకరణని ప్రారంభిస్తాం. ఆ షెడ్యూల్‌ పూర్తయిన వెంటనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ సినిమాలో వరుణ్‌కి జోడీగా సయీ మంజ్రేకర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఉపేంద్ర, సునీల్‌శెట్టి, నవీన్‌చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: జార్జ్‌ సి.విలియమ్స్‌, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని