Vijay: వినూత్న నటుడు.. విజయ్‌ విషాదాంతం - cinema
close
Updated : 15/06/2021 11:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vijay: వినూత్న నటుడు.. విజయ్‌ విషాదాంతం

అనతికాలంలోనే కన్నడనాట అద్భుత నటుడిగా గుర్తింపు పొందిన సంచారి విజయ్‌ (38) కన్నుమూశారు. రెండు రోజుల కిందట బెంగళూరులో ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆయన చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మెదడు కుడి భాగంలో బలమైన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ఉదయం 11.30 గంటల సమయంలో ఆయనకు బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు ప్రకటించారు. సంచారి విజయ్‌ అవయవాల్ని కుటుంబ సభ్యులు దానం చేశారు. శనివారం రాత్రి ద్విచక్రవాహనంపై వెనుక కూర్చుని ప్రయాణిస్తుండగా ఓ విద్యుత్తు స్తంభాన్ని ఢీకొనడంతో ఆయన తీవ్రంగా గాయపడడం గమనార్హం.విజయ్‌గా ‘రంగప్ప హోగ్బిట్నా’ సినిమా ద్వారా ఆయన చందనసీమలో ప్రవేశించారు. రామరామ రఘురామ, దాసవాళ, అరివు, ఒగ్గరణె, నాను అవనల్ల అవళు, కిల్లింగ్‌ వీరప్పన్‌, మేలొబ్బ మాయావి.. సినిమాల్లో నటించారు. 2015లో ఆయన హిజ్రాగా నటించిన ‘నాను అవనల్ల అవళు’ సినిమాలోని అభియనయానికి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం లభించింది.  

  - న్యూస్‌టుడే, బెంగళూరు


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని